యువ హీరో ఆది ప్రస్తుతం తన కెరీర్ లోనే తొలిసారి హర్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బుల్లితెరపై మెరిసిన ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ ఆద్వర్యంలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది.
కాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ‘నెక్స్ట్ నువ్వే’ నువ్వే అనే టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘యామిరుక్క భయమే’ అనే చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో ఆది సరసన వైభవి శాండిల్య హీరోయిన్ గా నటిస్తోంది.


