జూలై నుండి మొదలుకానున్న ఆది కొత్త సినిమా !

జూలై నుండి మొదలుకానున్న ఆది కొత్త సినిమా !

Published on Jun 23, 2018 1:06 PM IST

గత రెండు మూడేళ్ళుగా సాలిడ్ హిట్ లేని యువ హీరో ఆది సాయి కుమార్ ఈ ఏడాది రెండు కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారు. వాటిలో ఒకటి రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఉండనుండగా ఇంకొకటి నూతన దర్శకుడు శ్రీనివాస్ నాయుడు డైరెక్షన్లో ఉండబోతుంది. శ్రీనివాస్ నాయుడుతో చేయనున్న చిత్రం పూర్తిస్థాయి లవ్ స్టోరీగా ఉండనుంది.

ఈ చిత్రంలో ఆదికి జోడీగా సురభి నటించనుంది. జూలై నెలలో ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాస్, సిహెచ్.రామాంజనేయులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో ఈ ఏడాదైనా ఆది విజయాన్ని అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు