
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ టీం ఇటీవలే లడఖ్, ముంబై లాంగ్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకుంది. ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం మళ్ళీ బళ్ళారి వెళ్లనున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ ని బళ్లారిలో పూర్తి చేసారు. ఆ షెడ్యూల్లో ఓ పాటని, కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఈ తాజా షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుగుతుండడంతో డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అలాగే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అంతా అనుకున్న తేదీకి సినిమాని రిలీజ్ చేయడానికి బాగా కష్టపడుతున్నారు. మొదటి సారి మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిసున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.