ఆర్.ఎఫ్.సి షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ బాబు

Published on May 8, 2014 8:28 am IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ ఇన్ని రోజులు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఆ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. త్వరలోనే ఈ మూవీ తాజా షెడ్యూల్ గుజరాత్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా గుజరాత్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు మరియు పాటలను షూట్ చేయనున్నారు.

‘దూకుడు’ సినిమా తర్వాత మహేష్ బాబుతో శ్రీను వైట్ల చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీఅర్ గా కనిపించనున్నాడు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మొదటి సారి మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ‘దూకుడు’కి మించి ‘ఆగడు’లో కామెడీ ఉంటుందని సమాచారం.

సంబంధిత సమాచారం :