ఫస్ట్ వీక్ ఎండ్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా ‘ఆగడు’

Published on Sep 21, 2014 4:24 pm IST

Aagadu
నైజాంలో ఫస్ట్ డే 3.45 కోట్లు కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’, రెండవ రోజు కూడా రికార్డు కలెక్షన్స్ సాధించింది. నైజాంలో రెండవ రోజు 1.63 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ‘ఆగడు’ ఆదరగోడుతుంది.

ఫస్ట్ వీక్ ఎండ్ లో గ్రాండ్ ఓపెనింగ్స్ సాదించిన ‘ఆగడు’ సోమవారం కూడా తన తడాఖ చూపుతున్నాడు. పలు థియేటర్లలో అడ్వాన్సు బుకింగ్ లు దాదాపుగా 70% క్లోజ్ అయ్యాయి. ‘దూకుడు’ మీదున్న పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నైజాం, ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘ఆగడు’ ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.

ప్రేక్షకులలో మహేష్ బాబు అంటే ఉన్న క్రేజ్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు చేసిన భారి పబ్లిసిటీ.. ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడానికి హెల్ప్ అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. తమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :