బళ్ళారిలో ‘ఆగడు’ షూటింగ్

Published on Mar 4, 2014 9:08 am IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం బళ్ళారిలో జరుగుతోంది. ఈ మధ్య ఈ సినిమా ఓపెనింగ్ సాంగ్ ని అక్కడ షూట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా అక్కడ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు జి. శంకర్ అనే పేరుతో ఒక పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజులు అక్కడే నిర్వహించే అవకాశం ఉంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :