చివరి పాటకు స్టెప్పులేస్తున్న మహేష్ బాబు, తమన్నా.

చివరి పాటకు స్టెప్పులేస్తున్న మహేష్ బాబు, తమన్నా.

Published on Aug 20, 2014 6:49 PM IST

Mahesh_Tamanna

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమన్నా జంటగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్’లో జరుగుతుంది. ఒక సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ రోజు నుండి మరొక సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. ఇది చివరి పాట. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ నెల 25వ తేదితో స్విట్జర్లాండ్ షెడ్యూల్ ముగుస్తుంది. మూవీ యూనిట్ ఇండియాకి తిరిగి రాగానే మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తారు. నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

‘ఆగడు’లో శృతి హాసన్ స్పెషల్ సాంగులో సందడి చేయనుంది. ఆ పాటను శృతి స్వయంగా పాడడం విశేషం. తమన్ స్వరపరిచిన ‘ఆగడు’ పాటలు ఆగస్ట్ 28న అభిమానుల సమక్షంలో శిల్పకళా వేదికలో రిలీజ్ చేయనున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ కు ఇది 50వ సినిమా. అందుకే ‘ఆగడు’ ఆడియోపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమా సెప్టెంబర్ 19న విడుదలవుతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు.

తాజా వార్తలు