సూపర్ స్టార్ మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన ‘ఆగడు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
టీజర్, ట్రైలర్ లలో మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వరపరిచిన ఆడియోకి శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తుంది. జంక్షన్ లో అనే పాటతో శృతి హాసన్ తొలిసారిగా ప్రత్యేక గీతంలో హాల్ చల్ చేయనుంది. సుమారు 2000 థియేటర్లలో ‘ఆగడు’ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్స్ పై దృష్టి పెట్టారు. పబ్లిసిటీ కార్యక్రమాలను నిర్మాతలు ప్రారంభించారు.


