ఏప్రిల్ 27 న మొదలు కానున్న ‘ఆగడు’ తదుపరి షెడ్యూల్

Published on Apr 25, 2014 8:00 pm IST

Mahesh-Babu-Aagadu
కొంత విరామం తర్వాత మహేష్ బాబు తాజా చిత్రం ‘ఆగడు’ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఏప్రిల్ 27 మొదలు కానుంది. అనిల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట ఈ చిత్రన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

తమ్మన ఈ చిత్రం లో స్వీట్ షాప్ నడిపే ఒక సమాజ సేవకురాలిగా నటిస్తుంది. గత షెడ్యూల్ లో తమ్మన మహేష్ బాబు ల పై కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించారు. సోను సూద్ విలన్ పాత్ర చేస్తున్న ఈ చిత్రం లో బ్రహ్మానందం మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటివలే శ్రీను వైట్ల లడఖ్ లోని కొన్ని ప్రదేశాలని చూసి వచ్చారు త్వరలో అక్కడ షూటింగ్ జరపనున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కి కె.వి గుహన్ చాయాగ్రహణం అందిస్తున్నారు

సంబంధిత సమాచారం :