రామోజీ ఫిలిం సిటీలో ఆగడు

Published on Mar 22, 2014 7:07 pm IST

మహేష్ బాబు, తమన్నా జంటగా నటిస్తున్న ఆగడు సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రాయలసీమ వాతావరణం ప్రతిబింబించేలా అక్కడ ఒక సెట్ వేసి ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకుడు

ఈ సినిమాలో పోలీస్ పాత్ర పోషిస్తున్న మహేష్ మరోసారి తన కామెడీ టైమింగ్ తో మనల్ని కడుపుబ్బా నవ్వించనున్నాడు. గతకొన్నళ్ళుగా మహేష్ కామెడీ సెన్స్ లో చాలా మార్పు వచ్చింది. స్వీట్ షాప్ ను నడుపుకునే యువతి పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమాలో మహేష్, తమన్నాల మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. థమన్ సంగీతదర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలకానుంది

సంబంధిత సమాచారం :