బళ్ళారి నుండి వచ్చేసిన ఆగడు బృందం

Published on Mar 6, 2014 4:00 am IST

Mahesh-Babu-Aagadu
మహేష్ బాబు నటిస్తున్న ఆగడు సినిమా చిత్రీకరణకోసం బళ్ళారి వెళ్ళిన సంగతితెలిసినదే. ఇటీవలే ఒక పాటను, మరికొన్ని ముఖ్యసన్నివేశాలను తెరకెక్కించి అనుకున్న దానికంటే ముందుగానే ఈ షెడ్యూల్ ని ముగించారు.

ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. టైటిల్ సాంగ్ చిత్రీకరణ సమయంలో పరిసరాలు అంతా దుమ్ముతో నిండినా మహేష్ నటించిన తీరు అమోఘమని దర్శకుడు తెలిపాడు. ఈ షెడ్యూల్ లో ప్రతీరోజు మహేష్ షూటింగ్ లో పాల్గొనడం విశేషం. కాస్త విరామం తరువాత మరో షెడ్యూల్ ను మొదలుపెడతారు.

థమన్ సంగీత దర్శకుడు. కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత.

సంబంధిత సమాచారం :