బళ్ళారిలో మొదలైన ‘ఆగడు’ టైటిల్ సాంగ్

Published on Feb 23, 2014 12:05 pm IST

mahesh-tamanna
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి బళ్ళారిలో ప్రారంభం కానుంది. ఇక్కడ ఈ చిత్ర టీం మహేష్ బాబుపై టైటిల్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కి ముందు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ విషయంలో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ప్రధాన హైలైట్ అవుతుందని సమాచారం. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :