‘రాజమౌళి కుమారుడి’ సినిమా పోస్టర్ ఆకట్టుకుంది !

‘రాజమౌళి కుమారుడి’ సినిమా పోస్టర్ ఆకట్టుకుంది !

Published on Nov 21, 2018 7:40 PM IST

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ తెరక్కించబోతుంటే.. ఆయన కుమారుడు కార్తికేయ మాత్రం నిర్మాతగా మారి ‘ఆకాశవాణి’ అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. బాహుబలి సీరీస్ కు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజును కార్తికేయ తన నిర్మాణంలో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.

కాగా ఈ సాయంత్రం, మేకర్స్ ‘ఆకాశవాణి’ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ను చూస్తుంటే.. ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రంలా అనిపిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ (ఎడిటర్), సాయి మాధవ్ బుర్రా (డైలాగ్స్) వంటి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో నటించే నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు