ఓటిటి సమీక్ష: ‘ఆమె కథ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘ఆమె కథ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Apr 27, 2026 9:00 AM IST

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : ఏప్రిల్ 26, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ఆమని, దేవీ ప్రసాద్, త్రిశూల్, అక్షయ తదితరులు
దర్శకుడు : గట్రెడ్డి హరీ ప్రవ్సద్
నిర్మాత : నవీన యాట
సంగీతం : మిక్కిన్ అరుళ్ దేవ్
ఛాయాగ్రహణం : అర్లి గణేష్
ఎడిటింగ్ : ఐ రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ప్రతీ వారం లానే ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘ఆమె కథ’. వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన ఈ కొత్త లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

బెజవాడకి చెందిన ఒక చిన్నపాటి మధ్యతరగతి కుటుంబంలో భార్య భర్తలు ఆమని (ఆమని) తన భర్త (దేవీ ప్రసాద్) ని ఒక ఏసీ కొనివ్వమని కోరిక కోరుతుంది. కానీ తమ ఆర్ధిక పరిస్థితులు రీత్యా తాను దాన్ని నెరవేర్చలేకపోతాడు. అయితే ఎప్పటికైనా ఏసీ కావాలని బలంగా కోరిక పెట్టుకున్న తన తల్లి కోరికని తన కొడుకు (త్రిశూల్) తీరుస్తానని మాటిస్తాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత ఏమైంది? ఆమె కోరిక తీరిందా లేదా? ఈ క్రమంలో జరిగిన విషాదం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో నటి ఆమని చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఒక అమాయకమైన భార్యగా, తల్లిగా చక్కగా అమాయకత్వాన్ని చాలా బాగా చూపిస్తూ నటించారు. అలాగే తన భర్త పాత్రలో నటించిన దేవి ప్రసాద్ కూడా బాగా చేశారు. తమ ఇద్దరికీ తగ్గ పాత్రల్లో ఇద్దరూ ఇమిడి మంచి పెర్ఫామెన్స్ అందించారు.

అలానే తమపై కొన్ని ఎమోషన్స్ ఓకే అనిపిస్తాయి. అలానే కథనంలో లాజిక్లు లాంటివి పట్టించుకోకుండా కేవలం ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యేవారికి చివరి కొన్ని నిమిషాలు ఓకే అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఇందులో డిజప్పాయింట్ చేసే అంశాలు చాలా కనిపిస్తాయి. ఒకింత ఇది అవుట్ డేటెడ్ సబ్జెక్టు కానీ ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకునే ఛాన్స్ ఉంది కానీ దర్శకుడు ఆ ఛాన్స్ మిస్ చేశారు. మెయిన్ గా లాజికల్ గా ఈ చిత్రం ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

మొదట ఆమని, దేవి ప్రసాద్ లు ఏసీ కొనుకుందాం అని ప్లాన్ చేసినప్పుడే 30 వేలు నుంచి స్టార్టింగ్ రేటు. అప్పటికి వారికి ఉన్న పిల్లాడు స్కూల్ చదువుతాడు. అతడు పెద్దయ్యాక మారిన పరిస్థితులు కూడా ఒకప్పటిలానే ఉంటారు. ఆమని, దేవి ప్రసాద్ ల లుక్స్ కూడా అలానే ఉంటాయి. వారి లుక్ పరంగా కనీస జాగ్రత్త తీసుకున్నట్టు కనిపించదు.

ఈ టైం లైన్స్ పరంగా లాజిక్స్ కుదరవు. అలానే ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అన్నేళ్ల సమయంలో ఒక్క ఏసీ కొనుక్కోలేదు అనే పాయింట్ కూడా రియాలిటీకి దూరంగా ఉంటుంది. పైగా వారి ఫ్యామిలీ ఉండే ఇల్లు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ఇంతలో లాజిక్ చూడకూడదు అంటే కష్టమే అవుతుంది.

ఈ అంతటిలో చివరిలో అందించిన ఎమోషనల్ ఎండింగ్ మరీ ఎమోషనల్ మనుషులని కదిలించవచ్చు కానీ మిగతా ఆడియెన్స్ కి మాత్రం చాలా రొటీన్ అండ్ ఊహాజనిత ఎండింగ్ లానే అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. సంగీతం, కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు గట్రెడ్డి హరీ ప్రవ్సద్ విషయానికి వస్తే.. తాను ఒక సింపుల్ సబ్జెక్టునే తీసుకున్నారు కానీ కథనం మాత్రం బాగా ప్లాన్ చేసుకోలేదు. మినిమమ్ జాగ్రత్తలు కూడా ఇందులో తీసుకోలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇచ్చిన ఎమోషనల్ ఎండింగ్ కూడా రొటీన్ గానే ఉంది. నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ అయితే రాబట్టగలిగారు కానీ తన వర్క్ డిజప్పాయింట్ చేస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘ఆమె కథ’ అనే లఘు చిత్రం రొటీన్ గా అనిపించే వర్కౌట్ కాని ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. ఆమని, దేవి ప్రసాద్ ల నటన ఇందులో బాగుంది కానీ లాజికల్ గా ఎమోషన్స్ పరంగా ఈ లఘు చిత్రం మెప్పించలేదు. మినిమమ్ జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం మరింత బాధాకరం. సో వీటితో ఈ సినిమా మెప్పించలేదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు