ఇలా చేయొద్దు! మేమంతా ఏమైపోతాం – అమీర్ ఖాన్

ఇలా చేయొద్దు! మేమంతా ఏమైపోతాం – అమీర్ ఖాన్

Published on Feb 23, 2026 10:01 PM IST

Aamir-Khan

బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ప్లేబ్యాక్‌ సింగింగ్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. నేపథ్య గాయకుడిగా ఇకపై కొత్త సినిమాలు అంగీకరించనని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే, ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కోరారు. తన కుమారుడు జునైద్‌ఖాన్‌ చిత్రం ‘ఏక్‌ దిన్‌’ మూవీ టైటిల్‌ ట్రాక్‌ రికార్డు చేయడానికి అమీర్ ఖాన్.. ముర్షిదాబాద్‌ వెళ్లి అర్జిత్‌ ను కలిశారు. ప్లేబ్యాక్‌ సింగింగ్‌ నుంచి రిటైర్‌ అవ్వొద్దంటూ అమీర్ ఖాన్ కోరారు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏ ప్రాజెక్టు చేయడం లేదా ?, కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నావా ?, అసలు హిందీ సినిమాలే చేయకూడదనుకుంటున్నావా ? ఇలా చేయొద్దు! అర్జిత్‌.. మేమంతా ఏమైపోతాం’’ అంటూ అమీర్ ఖాన్ అన్నారు. అంతకు ముందు అర్జిత్‌ ఆయనకు పాదాభివందనం చేసి, సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు