100 లొకేషన్లలో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా

100 లొకేషన్లలో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా

Published on Sep 19, 2019 3:48 PM IST

బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు టామ్ హంక్స్ నటించిన పాత్రలో అమీర్ ఖాన్ కనిపించనున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ముంబై, డిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు,గుజరాత్ లాంటి 100 లొకేషన్లలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం సహజ సిద్దంగా కనబడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారట అమీర్ ఖాన్.

నవంబర్ 1 నుండి మొదలుకానున్న ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ బాగా బరువు తగ్గుతున్నారు. ఈ చిత్రాన్ని అద్వైత్ చందన్ డైరెక్ట్ చేయనున్నారు. 2020 క్రిస్మస్ నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు