రామ్ గోపాల్ వర్మ “ఆశ ఎన్‌కౌంటర్”.. రేపే ట్రైలర్..!

Published on Oct 31, 2021 2:03 am IST


వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ 2019లో తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసు ఎన్‌కౌంటర్ నేపధ్యంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి తొలుత దిశ ఎన్‌కౌంటర్ అని పేరు పెట్టినా, కొన్ని కారణాల రీత్యా ఆశ ఎన్‌కౌంటర్ అని పేరు మార్పు చేయాల్సి వచ్చింది.

అయితే రేపు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఉదయం 9.30 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించాడు. ఈ మూవీలో ఓ ఆడపిల్లను సామూహిక అత్యాచారం, హ‌త్య, కాల్చి చంప‌డ, ఆ తర్వాత పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం వంటి అంశాలను చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :