దివంగత నటుడు ‘రియల్ స్టార్’ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘ఆస్మాన్’. రామ్ నంధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి మేకర్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, మేఘాంశ్ ఈ సినిమాలో చాలా రగ్గడ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ఆశ్చర్యపరిచారు.
మిస్టరీ, యాక్షన్ కలగలిపి..
“మీరిప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోకచిలక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే” అంటూ సాగే గంభీరమైన వాయిస్‌ఓవర్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. తెలుపు రంగు దుస్తులు, కళ్లకు గంతలు కట్టుకున్న వ్యక్తులు, చర్చి నేపథ్యం, రహస్య పూజలు వంటి విజువల్స్ చూస్తుంటే దర్శకుడు ఏదో బలమైన మిస్టరీ కల్ట్ పాయింట్‌ను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ఆ వెంటనే హీరో, హీరోయిన్ ల మధ్య అందమైన లవ్ ట్రాక్‌ను పరిచయం చేస్తూ కథలోని ఎమోషన్‌ను టచ్ చేశారు.
మేఘాంశ్ రస్టిక్ యాక్షన్ అవతార్
టీజర్ చివర్లో వచ్చే సన్నివేశాలు కథలోని తీవ్రతను అమాంతం పెంచేశాయి. హీరోయిన్ ప్రమాదంలో పడటం, పోలీస్ స్టేషన్ డ్రామా, కాగడా పట్టుకుని హీరో చేసే రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రశాంత్ విహారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాల్లోని ఉత్కంఠను మరింత ఎలివేట్ చేసింది. శ్రీ క్లిన్ కారా సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై కొండరు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, అరబిక్ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఆకట్టుకునే కట్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ‘ఆస్మాన్’ టీజర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
