నాని ‘ప్యారడైజ్’ మ్యూజిక్ విధ్వంసం.. 100 మిలియన్ల వ్యూస్‌తో ‘ఆయా షేర్’ ఊచకోత!

The-Paradise

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మాస్ పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాట రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.

​నాని కెరీర్‌లోనే సినిమా విడుదల కాకముందే 100 మిలియన్ల మైలురాయిని చేరుకున్న తొలి పాటగా ‘ఆయా షేర్’ నిలిచింది. అంతేకాకుండా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ట్రాక్‌గా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్, నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలోని హుక్ స్టెప్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

​ఒక భారీ సెట్‌లో స్లమ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాటను అత్యంత రిచ్‌గా చిత్రీకరించారు. విజువల్స్‌లో నాని రగ్గడ్ లుక్ మరియు హై-ఎనర్జీ డ్యాన్స్ బీట్స్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version