ది ప్యారడైజ్ : మరో రేర్ ఫీట్ అందుకున్న ‘ఆయా షేర్’

ది ప్యారడైజ్ : మరో రేర్ ఫీట్ అందుకున్న ‘ఆయా షేర్’

Published on May 26, 2026 9:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆగస్ట్ 21, 2026న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి వచ్చిన పవర్‌ఫుల్ ‘ఆయా షేర్’ ట్రాక్ యూట్యూబ్‌లో 150 మిలియన్లకు పైగా వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న పాటగా ఇది రికార్డు సృష్టించింది. గతంలో ‘దసరా’ సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ పేరిట ఉన్న రికార్డులను ఇది బ్రేక్ చేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్ ఒక ఎత్తయితే, శ్రీకాంత్ ఓదెల విజన్, నాని అన్‌మ్యాచ్డ్ స్వాగ్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మాస్ పల్స్ తెలిసిన ఈ హిట్ కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది.

ప్రస్తుతం ఈ సాంగ్‌కి స్కూల్ పిల్లల నుంచి కాలేజీ యూత్ వరకు, క్లాస్ అండ్ మాస్ అనే తేడా లేకుండా అందరూ ఫుల్లుగా వైబ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని చార్ట్‌బస్టర్స్ లోడింగ్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

తాజా వార్తలు