ప్రేమ లేనిదే జీవితం లేదు : ఇళయరాజా

ilayaraja
తెలుగు సినీ పరిశ్రమకు ఈమధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన యువహీరోల్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. ఇక తన గత చిత్రమైన ‘జాదూగాడు’తో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను ట్రై చేసిన ఈ హీరో, ప్రస్తుతం రెండు వరుస సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒకటైన అబ్బాయితో అమ్మాయి సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకకు ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగింది.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇళయరాజా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రేమికులే అని, తనకు సంగీతం, మరొకరికి సినిమా, ఇలా అందరూ ప్రేమికులే అని అన్నారు. ప్రేమ లేనిదే జీవితం లేదని, అలాంటి ప్రేమ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వచ్చే నెలలో విడుదల కానుంది.

Exit mobile version