ఏబిసిడి ట్రైలర్ విడుదల !

Published on Apr 15, 2019 9:16 am IST

యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రం యొక్క ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైయింది. ఇక ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలను పెంచింది. అమెరికా లో పుట్టిన రిచ్ యంగ్ స్టర్ అవి (శిరీష్) స్టడీస్ కోసం హైదరాబాద్ కు వచ్చాక ఏవిధంగా ఇబ్బందులు పడ్డాడు అనే విషయాలను ఎంటర్టైనింగ్ గా చూపెట్టనున్నారు. అలాగే ఈసినిమాలో సోషల్ ఇష్యుస్ ను కూడా ప్రస్తావించనున్నారు.

మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా భరత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ఓవర్సీస్ లో విడుదలచేయనుంది.

కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జూదా శాండీ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మే 17న విడుదలకానుంది. మరి ఈ సినిమాతో శిరీష్ కెరీర్ లో మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :