‘ఏబిసిడి’ ట్రైలర్ కు రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 14, 2019 12:00 am IST

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి). కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ ను పోస్టర్ ద్వారా ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 9 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు.

కాగా ఈ చిత్రాన్ని మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ రిమేక్ చిత్రమైన అల్లు శిరీష్ కి మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :