మరోసారి రచ్చ లేపుతున్న అభిజీత్ ఫాలోవర్స్.!

Published on Nov 29, 2020 10:00 am IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఇప్పటి వరకు మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఈ సీజన్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ లో అభిజీత్ కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ పరంగా కానీ అలాగే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పరంగా కానీ ఏ కంటెస్టెంట్ కు లేని విధంగా సోషల్ మీడియాలో రచ్చ లేపుతారు.

అలా ఇపుడు అభిజీత్ ఫాలోవర్స్ మరోసారి సంచలనం రేపుతున్నారు. నిన్న వీకెండ్ కావడంతో హోస్ట్ నాగ్ వస్తారన్న సంగతి తెలిసిందే. కానీ నిన్నటి ఎపిసోడ్ అంతటిలో అభిజీత్ చేసిన తప్పుల పైనే టార్గెట్ చెయ్యడంతో అభి ఫాలోవర్స్ కు ఏమాత్రం నచ్చలేదు. దీనితో సోషల్ మీడియాలో మరోసారి లక్షల ట్వీట్స్ తో అభిజీత్ కోసం ట్రెండ్ చేస్తున్నారు.

అభిజీత్ ను టార్గెట్ చెయ్యడం ఆపాలి అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఇండియన్ ట్రెండ్స్ లో పెట్టేసారు. గత వారమే ఇలా వేరే అంశంపై కూడా చేసారు. అయితే గేమ్ అనే అంశాన్ని పక్కన పెడితే అభి విషయంలో ఫాలోవర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పాలి. అలాగే ఇదంతా కూడా నిన్న సాయంత్రం విడుదల చేసిన ప్రోమో ప్రభావమే అని కూడా చెప్పాలి. మరి అభిజీత్ విషయంలో ఫైనల్ గా ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More