‘భోగి’ ఫస్ట్ లుక్.. బీస్ట్ మోడ్ లో శర్వానంద్, రిలీజ్ డేట్ కూడా ఖరారు

‘భోగి’ ఫస్ట్ లుక్.. బీస్ట్ మోడ్ లో శర్వానంద్, రిలీజ్ డేట్ కూడా ఖరారు

Published on Feb 25, 2026 10:46 AM IST

Bhogi 2 1

మన టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. అయితే శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న భారీ చిత్రం భోగి. ఇది అనౌన్స్ చేసినప్పుడు మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి నేడు అవైటెడ్ ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. ఇక ఈ పోస్టర్ లో శర్వానంద్ మాత్రం ఊహించని రీతిలో కనిపిస్తున్నాడు. ఇటీవల వచ్చిన నారీ నారీ నడుమ మురారి కి పూర్తిగా భిన్నంగా ఒక రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

దీనితో ఈ ఛేంజ్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ తోనే మేకర్స్ ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్ ని కూడా ఇచ్చేసారు. దీనితో ఈ సినిమా ఈ ఆగస్ట్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమాతో తను ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అలాగే డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు