‘అభిమన్యుడు’ 18 రోజుల కలక్షన్స్ !

‘అభిమన్యుడు’ 18 రోజుల కలక్షన్స్ !

Published on Jun 21, 2018 6:16 PM IST

హీరో ‘విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ లో దూసుకుపోతుంది ఈ చిత్రం 18 రోజులకు గాను రూ.18.15 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలన విజయాన్నినమోదుచేసింది. గతంలో విశాల్ నటించిన ఏ చిత్రం కూడా ఇంత బాగా వసూళ్లను సాధించలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది .

ఈ చిత్రం విడుదలై 3 వ వారంలోకి ప్రవేశిస్తున్నా కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ చిత్ర విజయంలో యాక్షన్ కింగ్ ‘అర్జున్’ కీలక పాత్రను పోషించారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని కథానాయికగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు