కృష్ణ, వైజాగ్ ఏరియాల్లో భారీ వసూళ్లను రాబట్టిన ‘అభిమన్యుడు’ !

కృష్ణ, వైజాగ్ ఏరియాల్లో భారీ వసూళ్లను రాబట్టిన ‘అభిమన్యుడు’ !

Published on Jun 20, 2018 4:00 PM IST

విశాల్ చాన్నాళ్ల తరవాత ‘ఇరుంబు తిరై’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘అభిమన్యుడు’ పేరుతొ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. మొదటిరోజే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలను చూస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా, వైజాగ్ ప్రాంతాల్లో కలెక్షన్స్ పెద్ద మొత్తంలోనే ఉన్నాయి.

కృష్ణా జిలాల్లో 18 రోజులకుగాను రూ.69.33 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా 19 రోజులకు రూ.70.53 లక్షలు షేర్ ను వసూలు చేసింది. ఇక వైజాగ్ లో విషయానికొస్తే అక్కడ 19 రోజులకుగాను అత్యదికంగా రూ.1.37 కోట్ల షేర్ ను నమోదుచేసింది. పిఎస్. మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు