రెండో దెయ్యంగా ఆ హీరోయిన్ హైలెట్ అంటా !

Published on Apr 21, 2019 10:27 pm IST

ప్రభుదేవా, తమన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన అభినేత్రి 2 చిత్రం టీజర్ ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అభినేత్రి 1లో దెయ్యం తమన్నాను ఆవహిస్తే… అభినేత్రి 2 లో మాత్రం దెయ్యం ప్రభుదేవాను ఆవహించింది. మొత్తానికి హర్రర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సీక్వల్ హిట్ అవుతుందేమో చూడాలి.

ఇక ఈ చిత్రంలో తమన్నాతో పాటు మరో యంగ్ హీరోయిన్ నందితా శ్వేత కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. కాగా ఈ సినిమాలో నందితా శ్వేత దెయ్యంగా కనిపించనుంది. అంటే రెండో దెయ్యంగా అన్నమాట. ముఖ్యంగా నందితా శ్వేత సీన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయట. ఎలాగూ నందితా శ్వేత దెయ్యం పాత్రలకు పెట్టింది పేరు. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం మే 1వ తేదీన రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :