సమీక్ష : ‘అభినేత్రి 2’ – బోర్ గా సాగే హారర్ థ్రిల్లర్ !

Published on Jun 1, 2019 4:01 am IST

విడుదల తేదీ : మే 31, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.25/5

నటీనటులు :  ప్రభుదేవా, తమన్నా, సప్తగిరి తదితరులు.

దర్శకత్వం :  ఏఎల్ విజయ్

నిర్మాత : అభిషేక్ నామా

సంగీతం : సామ్‌ సి.ఎస్‌

సినిమాటోగ్రఫర్ : అనిల్ మెహతా


తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘అభినేత్రి 2’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కృష్ణ (ప్రభుదేవా) దేవి (తమన్నా) తో పెళ్లి అయి లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కృష్ణకి రంగారెడ్డి, అలెక్స్ అనే రెండు దెయ్యాలు పట్టుకుంటాయి. ఆ దెయ్యాల ప్రభావంతో కృష్ణ ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ప్రేమించని వెంటపడుతుంటాడు. అయితే ఈ విషయాలేమి కృష్ణకు తెలియదు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనలు అనంతరం దేవి ఆ దెయ్యలతో ఒక అగ్రీమెంట్ కుదుర్చుకుంటుంది. ఏమిటి ఆ అగ్రీమెంట్ ? అసలు రంగారెడ్డి, అలెక్స్ అనే దెయ్యాలు కేవలం కృష్ణను మాత్రమే ఎందుకు పట్టుకున్నాయి ? దేవి ఆ దెయ్యాల నుండి తన భర్తను ఎలా కాపాడుకుంది ? చివరికీ ఆ దెయ్యాల కోరికలు తీరాయా ? లేదా ? దాని కోసం దేవి ఏమి చేసింది ?లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆపదలో చిక్కుకున్న భర్తను ఓ భార్య ఎలాంటి కష్టాలు, బాధలు పడి భర్తను కాపాడుకుందనేదే ఈ సినిమా పాయింట్. పాయింట్ పరంగా సతి సావిత్రి లాంటి కథ గుర్తుకు తెస్తున్నప్పటికీ.. సినిమా నేపధ్యం, నటీనటుల నటన, సాంకేతిక బృందం పనితనం మొత్తానికి అభినేత్రి 2ను నిలబెట్టే ప్రయత్నం చేసాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్నా నటన అద్భుతంగా అనిపిస్తోంది. ప్రభుదేవా డాన్స్, తమన్నా గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

మెయిన్ గా హీరోగా ప్రభుదేవా తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా ప్రభుదేవా నటన బాగుంది. సినిమాలోని ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. అలాగే సినిమాలోనే కీలకమైన పాత్రలో నటించిన నందితా శ్వేతా చాలా గ్లామర్ గా కనిపిస్తూ తన పాత్ర పరిధిమేరకు బాగా నటించింది. అలాగే రంగారెడ్డి లవర్ గా నటించిన అమ్మాయి కూడా చాలా నేచురల్ గా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఏఎల్ విజయ్ తను రాసుకున్న కథ కథనంలో ఎక్కడా ప్లో లేకపోగా, అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆ కాస్త ఆసక్తిని కూడా నీరుగార్చాడు. మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పక్కన పెట్టి.. పండని కామెడీ అండ్ హారర్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు.

అసలు సినిమాలో.. అన్నిటికి మించి… ఓ రెండు దెయ్యాల కోరికలు నెరవేర్చుకునే క్రమంలో హీరోలో ప్రవేశించి హీరో ప్రాణానికే ఆపద కలిగేలా ప్రవర్తిసాయి. ఈ క్రమంలో హీరో ఏం అయిపోతాడో.. ఎలాంటి ఇబ్బందులకు గురవుతాడో.. అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ అండ్ టెన్షన్ ను ఎలివేట్ చేసే అవకాశం చాలా చోట్ల ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ను పెద్దగా వాడుకోకుండా అనవసరమైన సన్నివేశాలతో సినిమాని సాగతీశాడు.

ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తోంది. దర్శకుడు ఏ ఎల్ విజయ్ హీరో పాత్రను కూడా సరిగ్గా రాసుకోలేదు. తాను చేసే పనులను సీసీ ఫుటేజ్ ద్వారా చూసిన హీరో, తన ప్రవర్తన మీద తనకు అనుమానం వస్తోంది. కానీ ఆ తరువాత అసలు తనకు ఏమి తెలియనట్లు సినిమా మొత్తం హీరో చూస్తూ ఉండిపోవడం ప్రేక్షకులకు చికాకు పుట్టిస్తోంది. స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
సంగీత దర్శకుడు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకున్నేలా ఉంది. హారర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

తీర్పు :

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా హీరోయిన్స్ గా ‘అభినేత్రి’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ కామెడీ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే ప్రభుదేవా డాన్స్, తమన్నా గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ దర్శకుడు ఏఎల్ విజయ్ రాసుకున్న కథా కథనాల్లో ప్లో లేకపోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమా ఆసాంతం స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More