అభినేత్రి 2 రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 14, 2019 11:00 am IST

ప్రభుదేవా,తమన్నా జంటగా నటించిన త్రిభాష చిత్రం అభినేత్రి. 2016లో విడుదలైన ఈ హారర్ కామెడీ చిత్రానికి ఇప్పుడు సీక్వల్ తెరకెక్కుతుంది. ‘అభినేత్రి 2’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా , తమన్నా తో పాటు యంగ్ హీరోయిన్ నందిత శ్వేత ముఖ్య పాత్రలో నటిస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం మే 1న విడుదలకానుంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ విడుదలచేయనుంది.

సంబంధిత సమాచారం :