‘ఆచార్య’ నుండి క్రేజీ పోస్టర్ !

‘ఆచార్య’ నుండి క్రేజీ పోస్టర్ !

Published on Apr 13, 2021 12:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ‘పూజా హెగ్డే’ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ‘ఆచార్య’ నుండి చరణ్ – పూజా హెగ్డే కలయికలో అదిరిపోయే పోస్టర్ వచ్చింది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ లో రామ్ చరణ్ చేతిలో పూజా హెగ్డే.. ఇద్దరూ ఒకరి ఒకర్ని తీక్షణంగా చూసుకోవడం మొత్తానికి ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది.

అయితే ఈ సినిమాలో ఆమెది కేవలం 20 నిమిషాల పాత్ర అని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో పూజా రోల్ ఉంటుందట. కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా చిరు ఈ సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మారనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు