లేటెస్ట్..”ఆచార్య” రిలీజ్ ఈ ఏడాదిలోనేనా.?

Published on Sep 1, 2021 12:25 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం రిలీజ్ పట్ల కాస్త మిస్టరీ కొనసాగుతూ వస్తుంది.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో విడుదల కావడం ఫిక్స్ అయ్యింది అని చిరు కూడా అందుకే మొగ్గు చూపుతున్నారని టాక్. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే బహుశా ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా ఆచార్య రిలీజ్ నవంబర్ నెలలోనే ఉండనుంది అని సమాచారం.

రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. మరి మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :