ఫుల్ స్వింగ్ లో మెగాస్టార్ “ఆచార్య”.!

Published on Feb 25, 2021 9:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ముందు నుంచే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో మరిన్ని అంచనాలను ఏర్పర్చుకుందని చెప్పాలి.

మరి అలాగే ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ అలాగే చిరు ఇద్దరూ కూడా రాజమండ్రి మారేడు మిల్లి అడవుల్లో షూట్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ షూటింగ్ మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది అని ఈ చిత్ర సినెమాట్రోగ్రాఫర్ తిరు అంటున్నారు.

టీజర్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ను చూపించిన తిరు పేరు ఇప్పుడు హాట్ టాపిక్. తాను ఆన్ లొకేషన్ ఫోటో పెట్టి ఆచార్య షూట్ పూర్తి స్థాయిలో జరుగుతుందని తనని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న తమ క్యాస్ట్ అండ్ క్రూ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం :