మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న #NTRNeel చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోర్డాన్‌లో జరుగుతుండగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
కాగా, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 19న ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్ లేదా గ్లింప్స్ విడుదల కానుందని తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో బర్త్ డే ట్రీట్‌గా ఒక రోజు ముందుగా మే 19న టీజర్‌ను లాంచ్ చేసి అభిమానులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని జూన్ 25, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. మరి మే 19న ఎన్టీఆర్-నీల్ టీజర్ నిజంగానే రిలీజ్ అవుతుందా అనే విషయంపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.


