ఏజెన్సీ ప్రాంతంలో ‘ఆచార్య’ మొదలుపెట్టాడు !

Published on Feb 22, 2021 1:00 pm IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను చిత్రీకరించేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చిత్రబృందం ఎంచుకుంది. మెగాస్టార్ ఇప్పటికే షూట్ లో పాల్గొన్నారు. మరో వారం రోజులు పాటు అక్కడే షూటింగ్ జరుగుతుందట. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్‌ వేగంగా సాగుతోంది.

సంబంధిత సమాచారం :

More