రేపు ఆదికి అగ్ని పరీక్షే

రేపు ఆదికి అగ్ని పరీక్షే

Published on Jul 4, 2019 11:05 PM IST

రేపు 5వ తేదీ విడుదలకానున్న సినిమాల్లో ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్ర కథ’ కూడా ఉంది. ఈ సినిమా ఆదికి చాలా ముఖ్యమైనది. ఎందుకంత అతని కెరీర్ నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా సక్సెస్ సాసడించి తీరాల్సిన పరిస్థితి. ఆది గత చిత్రాలు ‘శమంతకమణి,నెక్స్ట్ నువ్వే, చుట్టాలబ్బాయ్, గరం, రఫ్, గాలిపటం’ లాంటివి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఆయన ఉన్నపళంగా హిట్ కావాలి.

ఒక రకంగా చెప్పాలంటే రేపు ఆదికి అగ్ని పరీక్షే. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆయన మార్కెట్ కుదురుకుంటుంది. లేకపోతే ఇంకొన్నాళ్ళు ఆయనకు హిట్ కోసం ఎదురుచూపులు తప్పవు. రెండు బుర్రలుండే యువకుడి కథగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎంటెర్టైనింగానే అనిపిస్తోంది. సినిమా కూడా అదే రీతిలో ఉంటే ఆదికి సక్సెస్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి దర్శకుడు డైమండ్ రత్నం సినిమాను ఎలా తీర్చిదిద్దారో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు