‘సైరా’కి పనిచేస్తున్న హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ఎవరో తెలుసా !

‘సైరా’కి పనిచేస్తున్న హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ఎవరో తెలుసా !

Published on Jun 12, 2018 1:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. వీటి రూపకల్పన కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్ పనిచేస్తున్నారు. వారిలో గ్రెగ్ పావెల్ కూడ ఒకరు. ఈయన గతంలో హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు.

వాటిలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, స్కై ఫాల్’ వంటి భారీ సినిమాలున్నాయి. మరి ఇంతటి ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ డిజైన్ చేస్తున్నారంటే ఆ సీన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉండబోతున్న ఈ సినిమా కోసం అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతి బాబు’ వంటి పాపులర్ నటీనటులు పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు