యాక్షన్ హీరో సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 22, 2018 3:55 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్.. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 18వ తేదీన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవ్వనుంది.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన కథానాయకిగా రాశీ ఖన్నా నటించనుంది. గతంలో రాశీ ‘జిల్’ సినిమాలో గోపీచంద్ సరసన నటించింది. తిరు చెప్పిన స్టొరీ అద్భుతంగా ఉందని, తన తరువాత సినిమాని ఆ కథనే చెయ్యాలని గోపీచంద్ సంపత్ నంది సినిమాని కూడా పోస్ట్ ఫోన్ చేసి మరీ ఈ సినిమా చేస్తున్నాడు.

ఇక దర్శకుడు సంపత్ నంది కూడా గోపీచంద్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా మొద్దలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :