తమిళ నటుడు ఆర్జే బాలాజీ ‘మూకుతి అమ్మన్’ (అమ్మోరు తల్లి) సినిమాతో దర్శకుడిగానూ ఆకట్టుకున్నారు. కాగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కరుప్పు’. స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ మే 14న రిలీజ్ కాబోతుంది. ఐతే, విజయ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నా సాధ్యపడలేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చారు. ఆర్జే బాలాజీ ఈ అంశం పై ఇంకా మాట్లాడుతూ.. ‘2023లో ఈ సినిమా కథ రాయడం ప్రారంభించా. కథ బాగా వచ్చింది.
ఈ కథకు స్టార్ హీరో అయితేనే బాగుంటుందని అనిపించింది. విజయ్‌ను కలిసి.. స్క్రిప్టు వినిపించాను. షూటింగ్ వెంటనే ప్రారంభించగలవా ? అని అడిగారు. నేనేమో కొంత సమయం కావాలని చెప్పా. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. దాంతో సూర్యతో ఈ సినిమా చేసున్నా’ అని ఆర్జే బాలాజీ తెలిపారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


