యాక్షన్ హీరో ఆ సీక్వెల్ ను స్టార్ట్ చేయనున్నాడు !

Published on Apr 11, 2019 8:00 pm IST

యాక్షన్ హీరో విశాల్, మిత్రన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇరుంబు తిరై(అభిమన్యుడు) గత ఏడాది తమిళంతో పాటు తెలుగులో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని విశాల్ గతంలోనే వెల్లడించాడు. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ ను స్టార్ట్ చేయనున్నాడు ఈ హీరో.

ప్రస్తుతం విశాల్, సుందర్ సి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈ చిత్రం తరువాత ‘ఇరుంబు తిరై 2’ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు విశాల్. అయితే ఈ సారి మిత్రన్ కాకుండా ఈ చిత్రాన్ని ఆనంద్ డైరెక్ట్ చేయనున్నాడు. విశాల్ సొంత బ్యానేర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :