శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా పయనం’. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్ గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది.
ప్రముఖ రచయిత కాసర్ల శ్యాం సాహిత్యం అందించిన ఈ రొమాంటిక్ గీతానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను సత్య ప్రకాష్‌తో కలిసి అనూప్ ఆలపించడం విశేషం. విడుదలైన ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు, అర్జున్ మరియు అనూప్ రూబెన్స్ కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినసొంపుగా ఉన్న ఈ బాణీ సంగీత ప్రియులను అలరిస్తోంది.
ఈ చిత్రంలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలోనూ, ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా అతిథి పాత్రలోనూ మెరవనున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


