విశాల్ ఎదో పెద్ద వార్తే పంచుకోనున్నారట

Published on Sep 12, 2019 1:51 pm IST

ఈ ఏడాది విశాల్ అయోగ్య మూవీతో తమిళంలో మంచి హిట్ అందుకున్నారు. తెలుగు టెంపర్ కి రీమేక్ గా వచ్చిన అయోగ్య తమిళ ప్రేక్షకులకు బాగానే నచ్చింది. విశాల్ ఆ మూవీని తెలుగులో కూడా విడుదల చేశాడు. కానీ ఆల్రెడీ తెలుగు జనాలకు తెలిసిన సినిమానే కావడంతో దాని సంగతి అసలు పట్టించుకోలేదు. కాగా ఆయన

ప్రస్తుతం విశాల్ యాక్షన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు సి సుందర్ ఈ చిత్రాన్ని ఉగ్రవాదం నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నేడు 8గంటలకు ఇవ్వనున్నారట. విశాల్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ని తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం ద్వారా పంచుకున్నారు. మరి విశాల్ ఇవ్వనున్న ఆ అప్డేట్ ఏమైఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా మూవీ టీజర్ డేట్ అనౌన్స్ మెంట్ చేస్తారేమో చూడాలి. ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More