అనారోగ్యానికి గురైన కెజిఎఫ్ నటుడు..!

అనారోగ్యానికి గురైన కెజిఎఫ్ నటుడు..!

Published on Aug 9, 2020 9:00 AM IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందుతుంది.సంజయ్ దత్ కి శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో ఆయనను ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు చేయగా, నెగెటివ్‌ అని వచ్చింది. సంజయ్‌ దత్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

కాగా ప్రతిష్టాత్మక కెజిఎఫ్ 2 మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. అధీరా అనే ప్రధాన విలన్ గా సంజయ్ దత్ చేస్తుండగా, ఆయన లుక్ బర్త్ డే కానుకగా విడుదల చేశారు. పెద్ద జెడ, ముఖంపై టాటూలు కలిగి ఉన్న సంజయ్ లుక్ భయంకరంగా ఉంది. హాలీవుడ్ సినిమాలలో కనిపించే వైకింగ్స్ స్ఫూర్తితో అధీరా లుక్ డిజైన్ చేసినట్లు మేకర్స్ తెలియజేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు