ఫైటర్ లో సీనియర్ యాక్షన్ హీరో !

ఫైటర్ లో సీనియర్ యాక్షన్ హీరో !

Published on Dec 13, 2020 12:30 AM IST

arjun

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ ఓ సినిమా చేస్తోన్నాడు. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా యాక్షన్ హీరో అర్జున్ కనిపించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అర్జున్ ఒకప్పుడు మంచి హీరో. తమిళనాట, కన్నడ నాట కూడాఅర్జున్ కి మంచి గుర్తింపు ఉంది.

అయితే విజయ్ దేవరకొండ, అర్జున్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. తండ్రికొడుకుల ఎమోషన్ చాలా బాగుంటుందని తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. మరి విజయ్ దేవరకొండకు ఫైటర్ ఏ రేంజ్ హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు