యూ ట్యూబ్ లో దుమ్మురేపుతున్న యాక్షన్ టీజర్

Published on Sep 15, 2019 6:06 pm IST

విశాల్ లేటెస్ట్ మూవీ యాక్షన్ టీజర్ ఈనెల 13న విడుదలై విశేష ఆదరణ దక్కించుకొంటుంది. ఇప్పటికే ఈ టీజర్ 3.5 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగడం విశేషం. యాక్షన్ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని టీజర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. చేజింగ్స్, రన్నింగ్స్, ఫైటింగ్స్ తో సాగిన యాక్షన్ టీజర్ ఉత్కంఠ భరితంగా ఉంది. టీజర్ తరువాత చిత్రం పై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.

అలాగే ఈ చిత్రంలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో యాక్షన్ మూవీలో తమన్నా గ్లామర్ తోనే కాకుండా యాక్షన్ సన్నివేశాలలో కూడా ఇరగదీయనుందని తెలుస్తుంది. దర్శకుడు సి. సుందర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మరో హీరోయిన్ గా ఐశ్వర్య లేక్ష్మి నటిస్తుండగా, హిప్ హాఫ్ తమీజ్ సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More