డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన విలన్ !

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన విలన్ !

Published on Oct 23, 2018 4:10 PM IST


బాలీవుడ్ నటుడు అజాజ్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయ్యాడు. దూకుడు, నాయక్‌, బాద్‌షా వంటి చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ చేసిన అజాజ్ ఖాన్ నిన్న రాత్రి బేలాపూర్ లోని ఒక హోటల్లో అతను డ్రగ్స్ తో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజాజ్ ఖాన్ బిగ్‌బాస్‌ టీవీ షోతో పాపులర్‌ అయ్యాడు. అయితే ఇప్పటికే పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేసాడు. ఈ రోజు అతన్ని కోర్టులో కూడా హాజరుపరచిన్నట్లు తెలుస్తోంది.

కాగా అజాజ్‌ ఖాన్‌ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడ ఒక బ్యూటీషియన్ ను బెదిరించిన విషయంలో పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు