సినీ నటుడు చంద్రమోహన్ కు అస్వస్థత..

సినీ నటుడు చంద్రమోహన్ కు అస్వస్థత..

Published on Feb 19, 2015 2:51 PM IST

chandra-mohan
ప్రముఖ సినీ నటుడు చంద్ర మోహన్ అస్వస్థతకు గురవ్వడంతో ఆయన్ను జూబ్లిహిల్స్ లో అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాకి ఇంకా సమాచారం అందలేదు. సాధారణ ఆరోగ్య సమస్యల వలన ఆస్పత్రిలో చేరారా..? లేక ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా..? అనేది తెలియడం లేదు.

బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘రంగులరాట్నం’ సినిమా ద్వారా హీరోగా చంద్ర మోహన్ సినీ రంగ ప్రవేశం చేశారు. 21 సంవత్సరాల వయసులో తొలి సినిమాతో పరిశ్రమలో ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. ఆ సినిమా బంగారు నంది అవార్డుతో పాటు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశారు. అప్పట్లో చంద్రమోహన్ పక్కన నాటిస్తే అగ్ర హీరోయిన్ అవుతారనే సెంటిమెంట్ ఉండేది. పలువురు ఆయన పక్కన నటించిన తర్వాత టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకున్నారు కూడా. తన వద్దకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలనేది చంద్రమోహన్ సిద్ధాంతం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

తాజా వార్తలు