కోలుకుంటున్న సినీ నటుడు చంద్రమోహన్

కోలుకుంటున్న సినీ నటుడు చంద్రమోహన్

Published on Feb 20, 2015 3:10 PM IST

chandra-mohan

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ కోలుకుంటున్నారు. గురువారం నాడు మైల్డ్ హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. చంద్రమోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన మేనల్లుడు కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘ఒకటి రెండు రోజుల్లో చంద్రమోహన్ గారిని డిశ్చార్జ్ చేస్తారు. త్వరగా కోలుకుంటున్నారు’ అని కృష్ణప్రసాద్ తెలిపారు.

బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘రంగులరాట్నం’ సినిమా ద్వారా హీరోగా చంద్ర మోహన్ సినీ రంగ ప్రవేశం చేశారు. 21 సంవత్సరాల వయసులో తొలి సినిమాతో పరిశ్రమలో ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. ఆ సినిమా బంగారు నంది అవార్డుతో పాటు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటివల ‘లౌక్యం’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాల్లో చంద్రమోహన్ నటనకు మంచి పేరొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు