లాక్ డౌన్ ఎఫెక్ట్..సొంతూరిలో రైతుగా మారిన నటుడు

jawazuddin
లాక్ డౌన్ కారణంగా మూడు నెలలుగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీనితో సినిమా నటులకు పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది నటులు తమ సొంతూరికి వెళ్లి ఇష్టమైన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. తాజాగా నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ రైతు అవతారం ఎత్తాడు. ఆయన తన సొంతూరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్నాడు.

నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీది ఉత్తర ప్రదేశ్ లోని బుధాన అనే ఓ చిన్న టౌన్. లాక్ డౌన్ తరువాత ఆయన తన సొంతూరికి వెళ్లారు. అక్కడ వాళ్ళ సొంత వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తూ రైతుగా మారాడు. స్టేజి ఆర్టిస్ట్ అయిన నవాజుద్దీన్ చాలా కష్టపడి బాలీవుడ్ లో నటుడిగా ఎదిగారు. అమిర్ ఖాన్ హీరోగా 1999లో వచ్చిన సర్ఫ్ రోస్ సినిమాతో వెండితెరకు పరిచమైన నవాజుద్దీన్ గొప్ప నటుడిగా ఎదిగారు.

Exit mobile version