‘మా’ ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చిన మరో నటుడు..!

Published on Aug 24, 2021 2:02 am IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు వంటి వారు పోటీపడుతున్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ కూడా అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించాడు. ‘మా‘ అసోసియేషన్ పాడైపోయిందని, కేవలం పదవుల కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కాదంబరి కిరణ్ ఇప్పుడు అధ్యక్ష బరిలో నిలబడడం ఆసక్తిగా మారింది.

అయితే తాను ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని ధీమాగా చెప్తున్నాడు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తాను బావా బావమరుదులమని శివాజీ రాజా ప్యానల్‌లో కూడా తాను పని చేశానని అన్నాడు. ‘మా’లో దాదాపు 900 మందికి సభ్యత్వం ఉన్నా ఎన్నికలు జరిగినపుడు మాత్రం ఓటు వేయడానికి కేవలం 415 మంది మాత్రమే వస్తారని అందులో కూడా 300 వరకు ఓట్లు తనకే పడతాయని అన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాను ఈ మాటాలు చెప్పడం లేదని, ఎన్నికలు జరిగిన తర్వాత ఈ విషయం మీకే తెలుస్తుందని కాదంబరి కిరణ్ అన్నాడు.

సంబంధిత సమాచారం :